Saturday, January 18, 2025
Homeసినిమా'ధమాకా' నుంచి 'మాస్ రాజా' లిరికల్ వీడియో రిలీజ్

‘ధమాకా’ నుంచి ‘మాస్ రాజా’ లిరికల్ వీడియో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా‘ మేకర్స్ చార్ట్‌బస్టర్‌ ‘జింతాక్‌’తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘మాస్ రాజా’ను విడుదల చేశారు. ‘మాస్ రాజా’ టైటిల్ కి తగ్గట్టే వుంది ఈ పాట. భీమ్స్ సిసిరోలియో థియేటర్లు దద్దరిల్లేలా మాస్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు. సాంగ్ వీడియోలో మెస్మరైజ్ చేశారు రవితేజ.

ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మాస్ కి డబుల్ ఇంపాక్ట్ ని ఇచ్చింది.  బడా ఎంటర్ టైన్మెంట్ వాలా ఆగయా, బిసి సెంటర్లో మోగాలి తాలియా, మాస్ మహారాజా ఇమేజ్ తగ్గట్టు సాగిన ఈ లిరిక్స్ మళ్ళీమళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. నకాష్ అజీజ్ఈ పాటని ఫుల్ గ్రేస్ తో ఎనర్జీటిక్ గా పాడారు. ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘జింతాక్‌’ సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఇప్పుడు మాస్ రాజా పాట కూడా మాస్ చార్ట్‌బస్టర్‌ హిట్ ని అందుకుంది.

పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకు జోడిగా టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల సందడి చేయనుంది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

Also Read : రవితేజ ‘ధమాకా’లో ‘జింతాక్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్