Sunday, January 19, 2025
HomeTrending Newsసికింద్రాబాద్ క్లబ్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ క్లబ్ లో అగ్నిప్రమాదం

Massive Fire At Secunderabad Club :

సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో క్లబ్ పూర్తిగా దగ్ధo అయింది. బ్రిటిష్ కాలంలో నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ 18వ శతాబ్దంలో నిర్మించిన సికింద్రాబాద్ క్లబ్.. ప్రధాన భవనం పూర్తిగా కాలిపోయింది. సికింద్రాబాద్ క్లబ్ లో 15 లక్షలు కడితెనే సభ్యత్వం లభిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్