పురుషుల టి 20వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో బంగ్లాదేశ్ – ఐర్లాండ్ మధ్య నేడు జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షంతో గ్రౌండ్ మొత్తం తడిసి ముద్ద కావడంతో కనీసం టాస్ కూడా వేయక ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మెగా టోర్నమెంట్ లో టాస్ కూడా వేయకుండా రద్దయిన రెండో మ్యాచ్ ఇది కావడం గమనార్హం. ఇదే గ్రౌండ్స్ లో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొన్న బుధవారం జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయ్యింది. అదేరోజు మధ్యాహ్నం సెషన్ లో ఇంగ్లాండ్- ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కు కూడా ఇదే సమస్య తలెత్తి డక్ వర్త్ లూయూస్ పద్ధతి ద్వారా ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు.
మరోవైపు ఈ సోమవారం అక్టోబర్ 24న హోబర్ట్ లోని బెల్లిరివ్ ఓవల్ మైదానంలో సౌతాఫ్రికా-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో సైతం వర్షం సౌతాఫ్రికాకు విజయాన్ని దూరం చేసింది.
మొత్తం మీద నాలుగు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కావడమో, ఫలితం తారుమారు కావడమో జరిగింది.
ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించే సమయంలో వర్షం పడినప్పుడు ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండాలన్న దానిపై ఐసిసి ఒక నిర్దిష్టమైన ఆలోచన చేయాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ICC Men’s T 20 World Cup 2022: జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి