Thursday, November 28, 2024
Homeస్పోర్ట్స్Ranji Trophy: మయాంక్ డబుల్ సెంచరీ

Ranji Trophy: మయాంక్ డబుల్ సెంచరీ

రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్ లో భాగంగా ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బెంగాల్- మధ్య ప్రదేశ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  నిన్న అనుష్టుప్ 120; సుదీప్ కుమార్ 112 పరుగులు చేసి ఔటైన సంగతి తెలిసిందే. నేడు కెప్టెన్ మనోజ్ తివారీ-42; అభిషేక్ పోరెల్- 51 పరుగులు చేశారు.

మధ్య ప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 3; అనుభవ్ అగర్వాల్, గౌరవ యాదవ్ చెరో రెండు; అవేష్ ఖాన్, సరన్ష్ జైన్ చెరో వికెట్ పడగొట్టారు.

నేడు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మధ్య ప్రదేశ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. యష్ దుబే-12; హిమాన్షు మంత్రి-23 పరుగులు చేసి ఔట్ కాగా, సహర్ష్ జైన్-17, అనుభవ్ అగర్వాల్-4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో కర్నాటక-సౌరాష్ట్ర మధ్య జరుగుతోన్న రెండో సెమీస్ లో కర్నాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. 249 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. శ్రీనివాస్ శరత్ 66 పరుగులతో రాణించాడు.  తొలి ఇన్నింగ్స్ లో 407పరుగులకు ఆలౌట్ అయ్యింది.

సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కే. పటేల్ చెరో మూడు; చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర  తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. ఓపెనర్ స్నేల్ పటేల్ డకౌట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన విశ్వరాజ్ జడేజా 22 పరుగులుచేసి ఔటయ్యారు. ఈ రెండూ విద్వత్ కావేరప్పకే దక్కాయి. హార్విక్ దేశాయ్- 27; షెల్దాన్ జాక్సన్ -27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్