Mayank, Captain: పంజాబ్ కింగ్స్ లెవెన్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ ను యాజమాన్యం నియమించింది. ఈ విషయాన్ని నేడు ప్రకటించింది. మయాంక్ 2018 నుంచి పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ ఈ ఏడాది నుంచి కొత్తగా ఆడుతోన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా చేరడంతో ఖాళీ ఏర్పడింది. దీనితో జట్టు మయాంక్ ను కెప్టెన్ గా వ్యవహరించింది.
“2018 నుంచి నేను ఈ జట్టుకు ఆడుతున్నా, గతంలో కెప్టెన్ గైర్హాజరీలో ఒకట్రెండు సార్లు యాక్టింగ్ కెప్టెన్ గా పని చేశా, ఇప్పుడు జట్టుకు పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నా. ఈసారి పటిష్టమైన జట్టుతో మేము బరిలోకి దిగుతున్నాం. గతంలో కొన్నిసార్లు మంచి ఆట తీరు ప్రదర్శించినా టైటిల్ గెలవలేకపోయాం. ఈసారి తప్పకుండా విజేతలుగా నిలుస్తాం’ అని మయాంక్ ధీమా వ్యక్తం చేశాడు.
మయాంక్ తో పాటు, శిఖర్ ధావన్, బెయిర్ స్టో, కగిసో రబడ, ఒడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్, లివింగ్ స్టోన్, సందీప్ శర్మ, భానుక రాజపక్ష లాంటి కీలక ఆటగాళ్ళతో పంజాబ్ జట్టు పటిష్టంగా ఉంది.
Also Read : మార్చి 26 నుంచి ఐపీఎల్ షురూ