Monday, November 25, 2024
HomeTrending NewsNara Lokesh: దాన్ని సీరియస్ గా తీసుకుంటాం

Nara Lokesh: దాన్ని సీరియస్ గా తీసుకుంటాం

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు వ్యవహారంలో తనకూ, తన కుటుంబసభ్యులకూ ఎలాంటి పాత్రా లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతి కోర్ కాపిటల్ లో ఒక్క గజం భూమి కూడా తాము కొనలేదన్నారు. సిఐడి అధికారులు  నేడు తనకో బాహుబబలి సినిమా చూపించారని, దానిలో చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్ హెరిటేజ్ భూముల్లోంచే వెళ్లిందని, ఆ కంపెనీ కూడా భూమి కోల్పోయిందని లోకేష్ చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు కేసులో నేడు రెండోరోజు సిఐడి విచారణకు హాజరైన లోకేష్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

తనను ఒక్కరోజే  విచారించాలని ఏపీ హైకోర్టు ఆదేశించినా సిఐడి రెండోరోజు కూడా విచారించిందని, నిన్నటి ప్రశ్నలనే వాషింగ్ మిషన్ లో తిప్పినట్లు తిప్పి అడిగారని లోకేష్ అన్నారు. నేడు 47  ప్రశ్నలు అడిగితే వాటిలో రెండు మూడు మాత్రమే కొత్తవి ఉన్నాయన్నారు. తన తల్లి భువనేశ్వరి ఈ వ్యవహారంలో నిందితురాలు కాకపోయినా ఆమెకు సంబంధించిన ఐటి పత్రాలు తన ముందుంచి ప్రశ్నలు అడిగారని, దీన్ని తాను సీరియస్ గా తీసుకోవాలని అనుకుంటున్నానని వెల్లడించారు. మరోసారి నోటీసులు ఇస్తారా అని తానే అడిగానని దానికి విచారణాధికారిని బదులు ఇవ్వలేదన్నారు. ఆధారాలు లేని, తన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు అడిగితే తాను ఎలా బదులిస్తానని లోకేష్ అన్నారు.

జగన్ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటికి 32 రోజులపాటు చంద్రబాబును జైల్లో పెట్టిందని లోకేష్ పునరుద్ఘాటించారు. స్కిల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో 90:10  నిష్పత్తి అని ఉందని, 90 శాతం గ్రాంట్ ఇన్ కైండ్ అని ఉందని లోకేష్ అన్నారు. ఈ అంశంలో సిఎం కు ఏం సబంధం ఉంటుందని, అధికారులను అడగాలని.. కానీ అప్పట్లో పని చేసిన ప్రేమ చంద్రారెడ్డి, అజయ్ కల్లం రెడ్డి లను ఎందుకు విచారణకు పిలవలేదని లోకేష్ ప్రశ్నించారు,. సంతకాలు పెట్టిన ఇద్దరు అధికారులనూ పిలవకుండా పాలసీ ఫ్రేమ్ వర్క్ చేసిన బాబు ను అరెస్టు చేయడం బాధాకరమన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్