Sunday, January 19, 2025
HomeTrending Newsమేడిపల్లి లేఅవుట్ లో మార్చి 6న అన్ లైన్ వేలం

మేడిపల్లి లేఅవుట్ లో మార్చి 6న అన్ లైన్ వేలం

హైదరాబాద్ నగరం  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పరిధిలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) లే ఔట్ లో సోమవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతమైంది.

మేడిపల్లి లేఔట్ లో హెచ్ఎండిఏ 300 చదరపు గజాలు గల 50 ఫ్లాట్ లను రూపొందించింది.

సోమవారం నాటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు లేఅవుట్ నకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్, ఎస్టేట్ అధికారులు మేడిపల్లి లేఅవుట్ ప్రాధాన్యతను వివరించారు.

సమావేశానికి కీసర రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డిఓ) రమేష్, మేడిపల్లి తహసీల్దార్ మణిపాల్ రెడ్డి, హెచ్ఎండిఏ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఇ) హుస్సేన్, ప్లానింగ్ ఆఫీసర్ (పిఓ) ప్రభాకర్ రెడ్డి, ఎస్టేట్ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, డిఏఓ శోభ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్