Sunday, January 19, 2025
HomeTrending NewsKarimnagar: బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్ - మంత్రి కేటిఆర్

Karimnagar: బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్ – మంత్రి కేటిఆర్

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 2001లో పార్టీ ఏర్పాటుచేసినప్పటి నుండి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. నాటి నుండి నేటి వరకూ జిల్లా ప్రజలను మమేకం చేస్తూ తీసుకున్న ప్రతీ కార్యక్రమం విజయవంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా పనిచేస్తుంది.ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు కొల్లగొట్టే విదంగా రాబోయే మూడునెలలు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు మొదలు కార్యకర్త వరకూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండి వివిద కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రూపకల్పన కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అందుభాటులో ఉన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే మొదలవుతుందని మంత్రి కేటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంతో పాటు జిల్లాను అభివ్రుద్ది పథంలో నడుపుతున్న తీరుకు ప్రజల్లో మంచి స్పందన వ్యక్తమౌతుందన్నారు. రాబోయే మూడు నెలలు పూర్తి స్తాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కేసీఆర్ ప్రభుత్వ గొప్ప కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సాంస్క్రుతిక సారథి ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీలు విఫ్ బానుప్రసాద్, ఎల్.రమణ, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రమేష్ బాబు, వొడితెల సతీష్ కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, సంజయ్, కోరుకంటి చందర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్