Thursday, October 3, 2024
Homeసినిమాహైదరాబాద్‌ లో 'మెగా154' భారీ షెడ్యూల్

హైదరాబాద్‌ లో ‘మెగా154’ భారీ షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి,  డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్‌ల  కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘మెగా154′. రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.  ఈ సినిమా భారీ షూటింగ్ షెడ్యూల్  హైదరాబాద్‌లో నేడు ప్రారంభమైంది. టీమ్ మొత్తం ఈ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు.

మెగా154 ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల నిజమైనట్లయింది.  అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Readమెగా154 లో రవితేజ మెగా మాస్ ఎంట్రీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్