Saturday, January 18, 2025
Homeసినిమాకాజల్ ట్వీట్ తో బాగా ఫీలవుతున్న మెగా ఫ్యాన్స్

కాజల్ ట్వీట్ తో బాగా ఫీలవుతున్న మెగా ఫ్యాన్స్

లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల చందమామ కాజల్ అగర్వాల్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకుంది. ఆతర్వాత రామ్ చరణ్ తో ‘మగధీర’ సినిమాలో నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత నుంచి కాజల్ కెరీర్ లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే.. ఇటీవల పెళ్లి చేసుకుని కెరీర్ కు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇండియన్ 2’ మూవీలో నటిస్తుంది. మళ్లీ కెరీర్ పై కాన్ సన్ ట్రేషన్ చేస్తుంది. బాలయ్య సరసన కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా మెగా ఫ్యాన్స్ కాజల్ మీద కాస్త కోపంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ట్విట్టర్ లో తమ సహ అభిమానులను బ్యాన్ చేయమని పిలుపునిస్తున్నారు.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఆస్కార్ వేడుక ముగిశాక పలు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ టీమ్ ని విష్ చేస్తూ ట్వీట్ చేశారు.. చేస్తున్నారు. అందులో కాజల్ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ ట్రోఫీ పట్టుకున్న పిక్ ని రీ ట్వీట్ చేస్తూ బిగ్ కంగ్రాట్యులేషన్స్ అంటూ మెసేజ్ పెట్టింది. మరో థ్రెడ్ లో టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతూ అందరినీ ట్యాగ్ చేసింది. అయితే అక్కడ ఎలాంటి ఫోటో లేదు.

తన కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ మగధీర ఇచ్చిన రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి బృందానికి ఇలాగేనా స్పందించడం అనేది మెగాభిమానుల వాదన. ఇక్కడ బయటికి కనిపించని కోణం ఒకటుంది. ఏంటంటే.. ఆచార్య సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ నటించింది. కొన్ని సీన్స్, ఒక పాటను కూడా షూట్ చేశారు. అయితే.. ఫైనల్ ఎడిటింగ్ లో కాజల్ క్యారెక్టర్ మొత్తం తీసేశారు. దీంతో ఈ అమ్మడు బాగా ఫీలైనట్టుంది. అందుకనే ఎన్టీఆర్ ఫోటోను మాత్రమే హైలెట్ చేసిందని అంటున్నారు సినీజనాలు. మరి.. దీనిపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read : RRRకు అభినందనల వెల్లువ

RELATED ARTICLES

Most Popular

న్యూస్