పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు కానీ.. రావాల్సినంత బజ్ క్రియేట్ అవ్వలేదు అనే టాక్ వినిపిస్తోంది. దీనికి ఓ కారణం థమన్ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోకపోవడం అనిపిస్తుంది. బ్రో పాటలు విన్నాకా.. ఇంత బ్యాడ్ ఆల్బమ్ ఊహించలేదని అభిమానులే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారంటే ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక ‘భోళా శంకర్’ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు కూడా రెండు రిలీజ్ చేశారు. ఈ పాటలు సినిమా పై ఎలాంటి హైప్ ని పెంచలేదు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పార్టీ పాట, అంతకు ముందు విడుదల చేసిన టైటిల్ సాంగ్ చూసేందుకు ఓకే కానీ ఆడియో పరంగా రొటీన్ గా ఉన్నాయనే టాక్ వచ్చింది. సినిమా పై బజ్ క్రియేట్ చేద్దామని పవన్ అభిమానిగా నటించానని తెలియచేస్తూ.. పవన్ ను ఇమిటేట్ చేసిన వీడియోను చిరు లీక్ చేసినప్పటికీ ఏమాత్రం బజ్ క్రియేట్ అవ్వకపోగా.. పవన్ ను చిరు సరిగ్గా ఇమిటేట్ చేయలేదనే టాక్ కూడా వచ్చింది.
ఇలా పవన్ బ్రో మూవీ, చిరు భోళా శంకర్ మూవీకి బజ్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఏదొటి చేసి సినిమాల పై బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ ఆలోచనలోపడ్డారట. ఈ సినిమాలకు ఒపెనింగ్ వరకు పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చు కానీ.. ఆతర్వాత కామన్ ఆడియన్స్ ని థియేటర్లోకి రప్పించాలంటే సినిమాలో ఎంతో విషయం ఉందనిపించాలి. ఈ సినిమాలకు బజ్ లేకపోవడానికి మరో కారణం.. రెండు సినిమాలు రీమేక్ లే ఓ కారణమైతే.. తెలుగులో దర్శకుడుగా అనుభవం లేని సముద్రఖని, అన్నీ ఫ్లాపులే తప్పా సక్సెస్ మూవీ తీయలేకపోయిన మెహర్ రమేష్ ఈ రెండు చిత్రాలకు దర్శకులు కావడం కూడా కారణం కావచ్చు అంటున్నారు సినీజనాలు. మరి.. బాక్సాఫీస్ దగ్గర మెగా బ్రదర్స్ ఏం చేస్తారో చూడాలి.