Saturday, January 18, 2025
Homeసినిమాచరణ్ బర్త్ డే పై దృష్టిపెట్టిన మెగా ఫ్యాన్స్!

చరణ్ బర్త్ డే పై దృష్టిపెట్టిన మెగా ఫ్యాన్స్!

రామ్ చరణ్ పుట్టినరోజు ఈ నెల 27వ తేదీన. ఈ సందర్భంగా సందడి చేయడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. చరణ్ ఈ పుట్టినరోజు నాటికి ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ పై ఉంది. అందువలన చరణ్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఎలాంటి గిఫ్ట్ ను వదులుతారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ సినిమా నుంచి ‘జరగండి .. ‘ అనే లిరికల్ సాంగ్ ను ఆ రోజున వదలనున్నారని తెలుస్తోంది. ఆ రోజు కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరిస్తూ వెళుతున్నారు. నిన్నటితో ఆ షెడ్యూల్ పూర్తయింది. ఆ తరువాత షెడ్యూల్ ను ఈ నెల 21వ తేదీ నుంచి హైదరాబాదులో మొదలెట్టనున్నారని అంటున్నారు. ముఖ్యమైన పాత్రలకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇక్కడ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ షెడ్యూల్ తో చాలావరకూ టాకీ పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఫైట్ .. ప్రతి సాంగ్ హైలైట్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తోంది.

పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అవినీతి పరులైన ముగ్గురు రాజకీయ నాయకులను ఎదుర్కునే హీరోగా చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడని చెబుతున్నారు. చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని నటిస్తుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో శ్రీకాంత్ .. అంజలి .. జయరామ్ .. సునీల్ .. ఎస్. జె. సూర్య .. నవీన్ చంద్ర కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగు పూర్తి కాగానే బుచ్చిబాబు ప్రాజెక్టుపైకి చరణ్ వెళ్లనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్