నా మీద పోటీ చేసినోళ్ళు ఎవరూ మళ్ళీ నియోజకవర్గంలో కనిపించలేదని మంతిర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పడు వస్తున్నవాళ్లు, వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ కనిపించరన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలోని శ్రీ తులసి మండల సమాఖ్య సమావేశం ఏడవ వార్షిక మహాసభ లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాళ్ళు వస్తారు. పోతారు… మనం మాత్రమే ఉంటామని, మనల్ని మనం కాపాడుకోవాలి. గెలిపించుకోవాలన్నారు. సీఎంగా కెసిఆర్ వచ్చిన తర్వాతే రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందన్నారు. నేను పాలకుర్తికి వచ్చిన తర్వాతే, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించింది. మహిళలు అభివృద్ది చెందితేనే, రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. అందుకే మహిళల అభివృద్ధి కోసం కుట్టుశిక్షణ చేపట్టాను, ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తున్నానని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 8న తొర్రూరులో మెగా జాబ్ మేళా
వచ్చే నెల 8వ తేదీన తొర్రూరులో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాను. ఈ సందర్భంగా అర్హతలు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. చదువుకున్న వాళ్ళంతా ఇందుకుసిద్ధం కావాలి. మీకు సంబంధితవివరాలను కూడా త్వరలోనే అందిస్తామన్నారు.
వల్మీడికి రండి
వచ్చే 4న వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామివారి విగ్రహాల పునః ప్రతిష్టాపన మరియు దేవాలయ పునః ప్రారంభోత్సవాలకు సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని మంత్రి మహిళలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా శ్రీ తులసి మండల మహిళా సమాఖ్యలోని 114 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 7 కోట్లు ఇదే సమాఖ్య సంఘంలోని 50 స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 2 కోట్ల రూపాయలను మంత్రి ఆయా సంఘాలకు పంపిణీ చేశారు.