Saturday, January 18, 2025
Homeసినిమావరుణ్ తేజ్ 'మట్కా' మూవీ ప్రారంభం..

వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ ప్రారంభం..

కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఫిక్సయిపోయింది. ఈ చిత్రానికి ‘మట్కా’ అనే పేరును చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. టైటిల్ లుక్ చూస్తుంటే 1970ల నాటి గ్యాంబ్లింగ్ నేపథ్యంతో కూడిన కథ అని తెలుస్తోంది. ఇందులో ఆ నాటి కారు, 1975లో ముద్రితమైన రూపాయి బొమ్మ చూడొచ్చు.తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యాక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. 1975 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్నట్లు పోస్టర్ ను చూస్తే తెలుస్తోంది.

వైరా ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం…  హైదరాబాద్ లో నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. వరుణ్ తేజ్ సహా చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో నటించనుంది.కాగా, ఈ మూవీని తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్