Monday, February 24, 2025
Homeసినిమావరుణ్ తేజ్ 'VT13' టైటిల్..?

వరుణ్ తేజ్ ‘VT13’ టైటిల్..?

వరుణ్ తేజ్, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందుతున్న ‘VT13’ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్… రినైసన్స్ పిక్చర్స్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవ సంఘటనల స్పూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-, హిందీ ద్విభాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ అధికారిగా కనిపిస్తారు.

బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి మేకర్స్ భారీ సెట్‌ను రూపొందించారు. మునుపెన్నడూ చూడని ఈ యాక్షన్ కోసం వరుణ్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, మేకర్స్ నుండి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద, భయంకరమైన వైమానిక దాడులలో పోరాడిన మన హీరోల పోరాట స్ఫూర్తికి తగిన పవర్‌ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. ‘దేశభక్తి’, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్‌తో కూడిన ఈ చిత్రం టైటిల్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్