Saturday, January 18, 2025
Homeసినిమావినాయ‌క్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగాస్టార్?

వినాయ‌క్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగాస్టార్?

Hit Combo: మెగాస్టార్ చిరంజీవి, డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ డైరెక్ష‌న్ లో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 చిత్రాలు రూపొంద‌డం.. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించ‌డం తెలిసిందే. ఆత‌ర్వాత మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయాలనుకున్నారు. లూసీఫ‌ర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్ మూవీకి ముందుగా వినాయ‌క్ నే అనుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ మోహ‌న్ రాజాకి అప్ప‌గించారు. ఆత‌ర్వాత వినాయ‌క్ ఛ‌త్ర‌ప‌తి రీమేక్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. చిరంజీవి గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య‌.. ఇలా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఈ వీటితో పాటు ఛ‌లో, భీష్మ చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమా చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పారు. ఈ భారీ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డివివి దాన‌య్య నిర్మించ‌నున్నారు. ఈ సినిమా తరువాత వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్నట్టు ఒక వార్త బలంగానే వినిపిస్తోంది.

దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఆరంభమైందని స‌మాచారం. వినాయ‌క్ పై చిరంజీవికి విపరీతమైన నమ్మకం ఉంది. తన స్టైల్, తన నుంచి అభిమానులు కోరుకునే అంశాలు వినాయక్ కి బాగా తెలుసును గనుక, ఆయనకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలిసింది. ఇదే క‌నుక నిజ‌మైతే.. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. అభిమానుల‌కు పండ‌గే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్