Chiranjeevi Mission Impossible :
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్లలుగా రోషన్, భానుప్రకాష్, జైతీర్థ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల విడుదల. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… నిర్మాత నిరంజన్ ఈ సినిమా గురించి చెబుతూ.. ఈ సినిమాను మీరు చూసి నచ్చితేనే ఫంక్షన్‌కు రమ్మన్నారు. సినిమా చూశాను. ఫెంటాస్టిక్ సినిమా. తాప్సీ ది చాలా పవర్‌ఫుల్ పాత్ర. `పింక్`లో ఎంత అద్భుతంగా నటించిందో తెలిసిందే. ఝుమ్మంది నాదం చేసినప్పుడు వేడుకలో చూశాను. అప్పుడు చూసిన అమ్మాయేనా అనిపించింది. వృత్తిపరంగా నిబద్ధతతో తనకంటూ ఓ మార్క్ వేసుకుంది. తను నటించిన ఘాజి సినిమా చూశాను. ఇక ముగ్గురు పిల్లలు ఎంటర్‌టైన్ చేశారు. వీరిని చూస్తుంటే, నేను నటుడిగా అవ్వాలనుకునే బీజం ఏర్పడిన రోజు గుర్తుకు వచ్చింది.
చిన్నతనంలో నేను 8వ తరగతి చదువుతుండగా బాలరాజు కథలో `మహాబలిపురం..`అని పాట పాడిన పిల్లాడు ప్రభాకర్ ప్రభావం నా పై వుంది. అలా పడిన బీజం నన్ను నటుడిగా మారేలా చేసింది. ఈ సినిమాలో పిల్లలు బాగా చేశారు. డ్యాన్స్ అద్భుతంగా చేశారు. చాలా అమాయకత్వంతో చేసిన నటన బాగుంది. వారు క్రైంలో ఇరుక్కోవడం చాలా ఎంటర్ టైన్‌మెంట్ ఇస్తుంది. సెకండాఫ్‌లో దర్శకుడు స్వరూప్ అద్భుతంగా మలిచాడు. మేటర్, మెటీరియల్, టాలెంట్ వున్న దర్శకుడు స్వరూప్. ఈ సినిమాతో మరింత నిరూపించుకుంటాడు. చిన్న పిల్లల సినిమా అంటాం కానీ.. ఇది పెద్దలు చూడాల్సిన సినిమా.
నిర్మాత నిరంజన్ రెడ్డి కథ ఎంపిక చేశారంటే ఒక మార్క్ వుంటుంది. నిర్మాత అనేవాడు కేషియర్ కాదు. కథలో, ప్రాసెస్‌లో నిర్మాత ప్రమేయం వుండాలి. అశ్వనీదత్, అరవింద్, కె.ఎస్. రామారావు, దేవీప్రసాద్ వంటి నిర్మాతలు కథలోనూ, సంగీతం, కాస్ట్యూమ్ ఇలా అన్ని రంగాల్లో ఇన్‌వాల్వ్‌మెంట్ అవుతారు. అప్పుడే ఆర్టిస్టుకు భరోసా వుంటుంది. ఈ సినిమా బయటకు తీసుకువచ్చి నిలబెట్టాలనే భరోసా కలిగిస్తారు కానీ… క్రమేణా నిర్మాత పరిస్థితి కేషియర్ లా మారిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అటువంటి నిర్మాత నిరంజన్ రెడ్డి అని చెప్పుకోవడం గర్వంగా వుంది అన్నారు
Also Read : ఏప్రిల్ 1 న `మిషన్ ఇంపాజిబుల్`