Thursday, May 15, 2025
Homeసినిమానా అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశా: చిరంజీవి

నా అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశా: చిరంజీవి

‘మా’ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అన్నారు. ఓటు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్న చిరు, భవిష్యత్‌ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు.

‘మా’ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని, అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నట్లు తెలిపారు. కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చని, దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్