Sunday, January 19, 2025
Homeసినిమావర్షాకాలం ఊటీ వెళ్తున్న ‘గాడ్ ఫాదర్’

వర్షాకాలం ఊటీ వెళ్తున్న ‘గాడ్ ఫాదర్’

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. మోహన్ లాల్ ‘లూసీఫర్’ రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదలైన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వచ్చింది. మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఉండే అంచనాలను ద్రిష్టిలో ఉంచుకొని దర్శకుడు మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు.

ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. దీనిలో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్