Sunday, January 19, 2025
HomeసినిమాChiranjeevi Three Movies: మూడు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన మెగాస్టార్..?

Chiranjeevi Three Movies: మూడు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన మెగాస్టార్..?

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ఫలితం ఆలోచనా విధానాన్నే మార్చేసిందట. ఇక నుంచి రీమేక్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయిన చిరు.. క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. ఇటీవల ఆయన కాలుకు సర్జరీ జరిగింది. అందుచేత ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే.. ఈ సమయాన్ని కథలను ఫైనలేజ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారట. నెక్ట్స్ చేయబోయే సినిమాల గురించి కథాచర్చలు జరిపి క్రేజీ ప్రాజెక్టులును ఫైనల్ చేశారట. మూడు క్రేజీ ప్రాజెక్టులు ఓకే చేశారని వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఏంటా మూడు క్రేజీ ప్రాజెక్టులు అనుకుంటున్నారా..? గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎప్పటి నుంచో చిరంజీవి చేయాలి అనుకుంటున్నారు. అసలు రీ ఎంట్రీ మూవీ గీతా ఆర్ట్స్ లోనే చేయాలి కానీ.. కుదరలేదు. ఇప్పుడు గీతాలో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ అని టాక్ వినిపిస్తోంది. ఇక మరో క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే… అనిల్ రావిపూడి. చిరంజీవి కోసం అనిల్ రావిపూడి ఓ ఎంటర్ టైనర్ రెడీ చేశాడట. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మింనున్నారని తెలిసింది. ఎప్పటి నుంచో దిల్ రాజు చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యిందని సమాచారం. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

సుకుమార్, అనిల్ రావిపూడి చిత్రాలకు ఓకే చెప్పారు.. మరి.. మూడో చిత్రానికి డైరెక్టర్ ఎవరంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని టాక్. చిరంజీవే స్వయంగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నట్టుగా వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం జరిగింది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసింది రామ్ చరణ్ అని కూడా చిరంజీవి ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట. ఇలా చిరంజీవి సుకుమార్, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే.

Also Read: మెగాస్టార్ సరసన మెరవనున్న అనుష్క త్రిష!

RELATED ARTICLES

Most Popular

న్యూస్