Sunday, January 19, 2025
Homeసినిమారాహుల్ విజయ్, మేఘ ఆకాష్ కొత్త చిత్రం

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ కొత్త చిత్రం

Megha-Rahul: యువ హీరో రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  ఈ సినిమాను మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మేఘా ఆకాష్ మాట్లాడుతూ “డియర్ మేఘ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పని చేశాను. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఇది మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కాబట్టి చాలా స్పెషల్ గా భావిస్తున్నాను” అన్నారు.

హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ “ఇవాళ మా కొత్త చిత్రాన్ని ప్రారంభించాం. మంచి కాన్సెప్ట్ మూవీ ఇది. కూల్ రోమ్ కామ్ గా ఆకట్టుకుంటుంది. ప్యాషనేట్ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్