Sunday, January 19, 2025
Homeసినిమామెహ్రీన్ కొంచెం యాక్టివ్ గా .. మరి కొంచెం స్పీడుగా ఉండాల్సిందే!

మెహ్రీన్ కొంచెం యాక్టివ్ గా .. మరి కొంచెం స్పీడుగా ఉండాల్సిందే!

టాలీవుడ్ కి పరిచయమైన గ్లామరస్ హీరోయిన్స్ లో మెహ్రీన్ ఒకరు. తొలి సినిమాతోనే నానీ జోడీగా ఛాన్స్ కొట్టేసిన ఆమె, అదే సినిమాతో హిట్ పట్టేసింది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ హిట్ తరువాత ‘మహానుభావుడు’ .. ‘రాజా ది గ్రేట్’ .. ‘ఎఫ్ 2’ హిట్లు ఆమె ఖాతాలోకి చేరిపోయాయి. ఆ తరువాత ఆ స్థాయి హిట్లు లేకపోయినా, వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తమన్నా తరువాత ఆ స్థాయి కలర్ ఉన్న హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసింది కూడా.

అవకాశాలు వచ్చిపడుతున్న సమయంలోనే ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ కారణం వల్లనే సినిమాలకి దూరంగా జరగడం మొదలెట్టింది. అయితే ఆ తరువాత మనసు మార్చుకుని, మరి కొంతకాలం పాటు ఇండస్ట్రీలోనే కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆమెకి రావలసిన అవకాశాలు వేరే వారికి వెళ్లిపోయాయి. కెరియర్ ను దార్లో పెట్టుకోవడం కోసం ఆమె ‘మంచిరోజులొచ్చాయి’ వంటి చిన్న సినిమా కూడా చేసింది.

మారుతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అంతగా ఆడలేదు. రవితేజ .. నాని .. శర్వానంద్ .. సాయితేజ్ వంటి హీరోలతో జోడీకట్టిన మెహ్రీన్, చిన్న సినిమా చేయడానికి ఒప్పుకోవడం .. అప్ కమింగ్ హీరోతో జోడీ కట్టడం ఆమె కెరియర్ మరింత మైనస్ అయింది. ఆ సినిమా ఆడితే పరిస్థితి వేరేలా ఉండేది .. కానీ దెబ్బకొట్టేసింది. అలా తన రేంజ్ ను .. మార్కెట్ ను మెహ్రీన్ తానే తగ్గించుకుంది.

ఇక మరో విషయం ఏమిటంటే గ్లామర్ పరంగా తాను మళ్లీ పూర్వ స్థితికి రావడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం చాలా లేట్ అవుతోంది. ఆమె మరీ సన్నబడటం ..  ఫేస్ లో ఇంతకుముందు ఉన్న గ్లో ఇప్పుడు లేకపోవడం అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తోంది. ఆమెకి అవకాశాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతమైతే  తెలుగు వైపు నుంచి ఆమె చేతిలో చెప్పుకోదగిన ప్రాజెక్టులైతే లేవు. కొత్త హీరోయిన్స్ నుంచి పోటీ పెరుగుతోంది. కొత్త ప్రాజెక్టులను అందుకోవాలంటే ఆమె కాస్త యాక్టివ్ గా ఉండాల్సిందే .. స్పీడ్ పెంచాల్సిందే

RELATED ARTICLES

Most Popular

న్యూస్