Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్పురుషుల హాకీ: ఇండియాపై గెలిచిన స్పెయిన్

పురుషుల హాకీ: ఇండియాపై గెలిచిన స్పెయిన్

Spain beat India: 2021-22 పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ మ్యాచ్ లో ఇండియా– స్పెయిన్  మధ్య నేడు జరిగిన రెండో మ్యాచ్ లో 5-3 తేడాతో  స్పెయిన్ జయకేతనం ఎగురవేసి నిన్నటి ఓటమికి నేడు బదులు తీర్చుకుంది. ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది

ఆట 6వ నిమిషంలోనే ఇండియా ఆటగాడు అభిషేక్  ఫీల్డ్ గోల్ చేసి శుభారంభం ఇచ్చాడు. అయితే 14వ నిమిషంలో స్పెయిన్ ఒకేసారి రెండు గోల్స్ (ఒక పెనాల్టీ కార్నర్, ఒక ఫీల్డ్ గోల్) సాధించి ఆధిక్యంలోకి వెళ్ళింది.

24వ నిమిషంలో స్పెయిన్ మరో గోల్ (పెనాల్టీ కార్నర్) సాధించింది. 27 వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ సాధించాడు. 51వ నిమిషంలో సుఖ్ జీత్ సింగ్ మరో ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు.  అయితే 54, 59 నిమిషాల్లో స్పెయిన్ రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్ సాధించి 5-3 తో పైచేయి సాధించి మ్యాచ్ ను గెల్చుకుంది.

ప్రో లీగ్ లో ఇండియా ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది,.

ఇండియా తన తరువాత మ్యాచ్ లను జర్మనీతో ఇదే కళింగ స్టేడియంలో మార్చి 12, 13 తేదీల్లో రెండు మ్యాచ్ లు ఆడనుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్