Monday, January 20, 2025
HomeTrending Newsవ్యాక్సిన్లతో లక్షల కోట్ల లాభాలు

వ్యాక్సిన్లతో లక్షల కోట్ల లాభాలు

Millions Of Crores Of Profits With Vaccines :

ఫైజర్, బియోన్ టెక్ , మోడెర్నా అనే మూడు వాక్సిన్ కంపెనీలకు కేవలం రెండు డోసుల వాక్సిన్ అమ్మినందుకు ఇప్పటిదాకా వచ్చిన లాభం ఎంతో తెలుసా ?  రెండు లక్షల యాభై వేల కోట్లు. అవును అక్షరాలా రెండున్నర లక్షల కోట్లు. ఖర్చుపోగా మిగిలింది. ఇంకేముంది? ఇక మిగిలింది ఒక బూస్టర్ డోస్ మాత్రమే అనుకొంటున్నారా ?

అయ్యో…మనిషి జన్మ ఎత్తి ఈ భూగోళంపై నివసిస్తున్న ప్రతి మనిషికి సంవత్సరానికి రెండు డోసులు వేసుకొనేలా చేసేదాకా వారు అగరు. దాని పర్యవసానాలు ఎలా వున్నా సరే !

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ వల్ల రెండేళ్ల పాటు మరణాలు సంభవించిన మాట వాస్తవం. కానీ అటుపైన వాక్సిన్ లేకుండా దాన్ని ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు ఎలా అధిగమించారు ? దాని కోసం సంవత్సరానికి రెండు వాక్సిన్ లు తీసుకొనే అమెరికా లాంటి దేశాల్లో ఏటా ఫ్లూ వల్ల అదే జలుబు వల్ల ఇరవై అయిదు వేల మంది ఎందుకు చనిపోతున్నారు అని మేధావులు , ప్రజలు ఎందుకు చర్చించరు?

నిగ్గదీసి అడగకపోతే ఏటా రెండు డోసులు తప్పని సరి చేస్తారు.
అన్నట్టు మరో విషయం. ముప్పై ఏళ్లకే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఎంతో మంది మరణించడం మీరు గమనించారా ? గతంలో ఇంత పెద్దఎత్తున గుండెపోటు మరణాలు ఉండేవి కావు. కోవిద్ సోకడం వల్ల మరణించారా? మరణించినవారిలో కోవిద్ సోకనివారు ఎంతో మంది. ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారో అడగండి. సమాధానం రావాలి

Also Read : డోసుల మాయా బజార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్