Sunday, January 19, 2025
HomeTrending Newsచిరుధాన్యాలతో సిఎం చిత్రపటం

చిరుధాన్యాలతో సిఎం చిత్రపటం

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మంత్రి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ సిరిధాన్యాలను ఉపయోగించి తయారుచేసిన  సిఎం జగన్ చిత్రపటాన్ని మంత్రి బహుకరించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ని యూఎన్ఓ ప్రకటించిందని, దీన్ని పురస్కరించుకొని ఈ చిత్రపటాన్ని తీర్చదిద్దారని మంత్రి వివరించారు. ఈ ఫోటోను ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా తిలకించి ప్రత్యేకతలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్‌ కూడా పాల్గొన్నారు.

Also Read : మంత్రులు, అధికారులకు సిఎం అభినందన

RELATED ARTICLES

Most Popular

న్యూస్