Monday, February 24, 2025
HomeTrending Newsపెన్నా రిటైనింగ్ వాల్ కు శంఖుస్థాపన

పెన్నా రిటైనింగ్ వాల్ కు శంఖుస్థాపన

పెన్నానది రిటైనింగ్  వాల్ నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీ సమీపంలో పెన్నానదిపై దాదాపు 94 కోట్ల 59 లక్షల రూపాయలతో నిర్మిస్తోన్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత ఏడాది సంభవించిన వరదలకు భగత్ సింగ్ నగర్ వాసుల కష్టాలు చూసిన సిఎం జగన్ వెంటనే స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అనిల్ మంత్రిగా ఉండగానే దీనికోసంనిధులు మంజూరయ్యాయని, వివిధ కారణాలతో శంఖుస్థాపన ఆలస్యం అయ్యిందని చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ఏడాది లోగా పూర్తయ్యేలా చూస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, కార్పొరేటర్లు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్