ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక సిఎం జగన్ చేసిన సోషల్ ఇంజినీరింగ్ కు నిదర్శనమని పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్ అయితే, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకి ఇంకా బీసీలపై కసి తగ్గలేదని అన్నారు. ఎమ్మెల్సీలుగా 11 మందిని ఎంపిక చేసి బీసీలకు చేసిన సామాజిక న్యాయాన్ని పక్కదోవ పట్టించాలనే గన్నవరం డ్రామాకు తెలుగుదేశం పార్టీ తెరతీసిందని సీదిరి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి మీడియా సమావేశం ముఖ్యాంశాలు:
- చంద్రబాబు ఎవరు సూట్ కేసులు ఇస్తే.. వారికే పదవులు ఇచ్చారు.
- ఏకంగా నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీలు ఇచ్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదే
- మేం చేసిన సామాజిక న్యాయం ప్రజల్లోకి వెళ్లకూడదని చంద్రబాబు విజయవాడలో గొడవలు సృష్టించాడు
- పట్టాభిని ఎవరైనా కిడ్నాప్ చేయగలరా? ఆయన్ను ఎవరైనా ఎత్తుకుని వెళ్లగలరా?
- మీరు తిడుతూ ఉంటే మేం చూస్తూ కూర్చోవాలా?
- మేం నిజంగా కన్నెర్ర చేస్తే మీరు నియోజకవర్గాల్లో తిరగగలరా..?
- చంద్రబాబూ… మీ అల్లరి మూకలను అదుపుచేసుకోండి
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్‌గారు చేస్తున్న సమన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది
- నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి మొత్తం 44 మంది ఎమ్మెల్సీల్లో 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు
- అది 68 శాతం కంటే అధికం…గతంలో ఏ నాయకుడికీ ఇది సాధ్యం కాలేదు
- వడ్డెరలను అణచి వేస్తున్నారని పాదయాత్రలో చినబాబు మాట్లాడుతున్నాడు
- మిస్టర్ మాలోకం..రాసుకో…వడ్డెర సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలకు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్ దే
- బీసీలకు మీ నాన్న ఎంత న్యాయం చేశాడో ముందు నువ్వు ప్రశ్నించు లోకేశ్
- తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్సీల ఎంపికలో… కేవలం 37 శాతం మాత్రమే అణగారినవర్గాల వారికి బాబు అవకాశం ఇచ్చాడు
- దాన్ని మర్చిపోయి బీసీలకు వన్నెతెచ్చిన పార్టీ టీడీపీ అంటూ బాకాలు ఊదుకుంటున్నారు
- బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ఇస్తాను అని జగన్మోహన్‌రెడ్డి గారు అంటే దానిపై చంద్రబాబు కోర్టుకు వెళ్లింది నిజం కాదా..?
- రాబోయే ఎన్నికలు…పేదవారికి, పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నికలు
- రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును నామరూపాల్లేకుండా చేయాలి
- ఇలాంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం అంటూ మాట్లాడారు.
Also Read : గన్నవరం టిడిపి ఆఫీసుపై దాడి: అచ్చెన్న ఆగ్రహం