Friday, November 22, 2024
HomeTrending Newsప్రధాని రాష్ట్రాల్లో పర్యటించాలి: ఎర్రబెల్లి సూచన

ప్రధాని రాష్ట్రాల్లో పర్యటించాలి: ఎర్రబెల్లి సూచన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా ముందు కన్నీరు కార్చడం కాదని, ప్రజల కష్టాలు తీర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖానించారు. మోడికి ఒక్క గుజరాత్ తప్ప వేరే రాష్ట్రం కనిపించడం లేదన్నారు, ప్రధాని రాష్ట్రాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలను విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.
సిఎం కేసిఆర్ కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి రోగులకు ధైర్యం చెప్పి వారిలో ఓ భరోసా కల్పించారని, ఏ ముఖ్యమంత్రి ఇలా కోవిడ్ రోగుల వద్దకు వెళ్లి పరామర్శించిన సందర్భాలు లేవని ఎర్రబెల్లి అన్నారు.

వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో ఆక్సిజన్, మందుల కొరత లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఆస్పత్రిలో సాంకేతిక సిబ్బంది కొరత వుందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని సిఎం ఆదేశించారని, ఎంజిఎం ఆస్పత్రిపై నమ్మకం ఉంది కాబట్టే పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులు వస్తున్నారని చెప్పారు.

సెంట్రల్ జైలు తరలింపు మంచి ఆలోచన అని, జైలు వెనుక ఉన్న 22 ఎకరాల స్థలంలో అత్యున్నత ప్రమాణాలతో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మించాలని, ప్రస్తుత ఎంజిఎం ఉన్న ప్రాంతంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మిచేందుకు సిఎం అంగీకరించారని ఎర్రబెల్లి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్