Minister Errabelli Met Chukka Ramaiah :
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్యకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి మాజీ సభ్యుడు, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన చుక్క రామయ్యను హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఆయన నివాసంలో కలిసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు మాట్లాడుతూ 1925 ఇదే రోజు పాలకుర్తి మండలం గూడురులో జన్మించిన చుక్కా రామయ్య నాడు హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. జనగామలో ఉపాధ్యాయుడిగా చేరి అనేక చోట్ల పని చేసిన ఆయన నాగార్జునసాగర్ ఆవాస పాఠశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారన్నారు. అనంతరం ఐఐటి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం కోసం హైదరాబాద్ కి వచ్చి నల్లకుంటలో ఆ కేంద్రాన్ని నడుపుతున్నారన్నారు. అప్పటి నుండి చుక్కా రామయ్య కాస్తా, ఐఐటి రామయ్యగా పేరు గాంచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారన్నారు. పిల్లలు, పెద్దల కోసం అనేక రచనలు చేసిన రామయ్య, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, ఆయనకు సుదీర్ఘ జీవితం లభించాలని మంత్రి ఎర్రబెల్లి కోరుకున్నారు. కొద్దిసేపు ఆయనతో ముచ్చటించిన ఎర్రబెల్లి దేశం, రాష్ట్రంలోని సమకాలిన పరిస్థితులపై చర్చించారు.
ఆ తర్వాత తన 97వ పుట్టినరోజు సందర్భంగా విద్యా నగర్ లోని తన నివాసంలో చుక్కా రామయ్య – ప్రముఖ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య,కె. రామచంద్రమూర్తి లతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.
Also Read :చారీ సాబ్ కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ