Friday, January 24, 2025
Homeతెలంగాణకేసియార్ సిఎం కావడం బిసిల అదృష్టం  : గంగుల

కేసియార్ సిఎం కావడం బిసిల అదృష్టం  : గంగుల

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చిత్తశుద్దితో చేపడుతోందని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిసిల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం తపిస్తుతారని, ఇంత మంచి మనసున్న సిఎం ఉండడం బిసిల అదృష్టం అని గంగుల వ్యాఖానించారు. రాష్ట్ర అభివృద్ధిలో బిసిల భాగస్వామ్యాన్ని పెంచి వారికి దక్కాల్సిన అవకాశాల కోసమే బిసి రిజర్వేషన్లు పదేళ్లపాటు పొడిగించామని వెల్లడించారు.

లాండ్రీ, దోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడం కోసం జూన్ 1తారీఖు నుండి 30వ తారీఖు వరకూ ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా మంత్రి గంగుల ఓ ప్రకటనలో తెలియజేశారు. రాష్టవ్యాప్తంగా ఉన్న 2 లక్షల రజక కుటుంబాలకు చెందిన లాండ్రీ షాపులకు, దోబీఘూట్లకు..నాయీభ్రాహ్మణ సోదరులకు చెందిన 70 వేల సెలూన్లకు లబ్ధి చేకూరుతుందన్నారు.  ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు పారదర్శక విధానం రూపొందించామని, ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని మంత్రి గంగుల సూచించారు.

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ – http://www.tsobmms.cgg.gov.in

RELATED ARTICLES

Most Popular

న్యూస్