Monday, February 24, 2025
HomeTrending Newsపవన్ జీవితం, జీవనం చిరంజీవే: అమర్నాథ్

పవన్ జీవితం, జీవనం చిరంజీవే: అమర్నాథ్

పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన భీమవరంలో ప్రధాని సమక్షంలో చిరంజీవిని సిఎం జగన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని, ఈ విషయాన్ని పవన్ జీర్ణించుకోలేక పోతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. జగన్ తనను ఎంతో గౌరవించారని చిరంజీవి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.  పవన్ జీవితం, జీవనం చిరంజీవే అన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిన్న సిద్ధవటం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గుడివాడ స్పందించారు. కార్టూన్ సినిమాల్లోని విలన్ల పేర్లు పవన్ అందరికీ పెడుతున్నారని, ఆయనకు సినిమాలపై ఉన్న అవగాహన రాజకీయాలపై లేదని విమర్శించారు. పవన్ ఎవరితో కలిసి పోటీ చేసినా తమకు ఇబ్బంది లేదని, ఆ విషయాన్ని పట్టించుకోబోమని స్పష్టం చేశారు.

సిఎం జగన్ ను విమర్శించే అర్హత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేదని, నేటి సభలో అయన విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా మాట్లాడితే బాగుండేదని, దాన్ని ఎంతకు అమ్ముతున్నారో కూడా చెప్పి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు.

Also Read : ఆ నేతల స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్