Minister Harish Criticized The Lack Of Coordination Between Central And State Bjp leaders :
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, అబద్దాలు మాట్లాడటం లో మిగతా బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. అబద్దాలని మేము చెబుతున్నా సోషల్ మీడియా లో ఇంకా బీజేపీ నేతలు వాటిని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి తన్నీరు హరీష్ రావు, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,టీ ఆర్ ఎస్ కార్యదర్శులు సోమ భరత్ ,ఎం.శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. వరి ,సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీ వి అబద్ధాలే అన్నారు. కిషన్ రెడ్డి మెడికల్ కళాశాలల విషయం లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎయిమ్స్ కు బీబీ నగర్ లో మేము స్థలమే ఇవ్వలేదని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మేము నిమ్స్ కోసం స్థలం భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఎయిమ్స్ కు ఇచ్చామని, ఇలా ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణే కావచ్చన్నారు.
బీబీ నగర్ ఎయిమ్స్ కు 24 ఎకరాల స్థలమిచ్చాము.. ఇదిగో దానికి సంబంధించిన జీవో విడుదల చేస్తున్నామని హరీష్ వివరించారు. పచ్చి అబద్దాలు మాట్లాడిన కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, గోబెల్స్ ను మించి పోతున్నారు బీజేపీ నాయకులన్నారు.
మెడికల్ కళాశాల విషయం లో తెలంగాణ కేంద్రం తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు అని కిషన్ రెడ్డి మరో పచ్చి అబద్ధం చెప్పారు. మేము అడగక పోతే హర్షవర్ధన్ లేఖ ఎందుకు రాస్తారన్నారు. యూపీ కి 27 మెడికల్ కాలేజి లు ఇచ్చి తెలంగాణ కు ఇవ్వకపోవడం మా పట్ల సవతి తల్లి ప్రేమ, అవమానం ప్రదర్శించడం కాదా అని ప్రశ్నించారు. ఎయిమ్స్ మీరు ఇవ్వడం ఏమిటీ. అది విభజన చట్టం కింద ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి కి దమ్ముంటే విభజన చట్టం కింద ఇచ్చిన హామీలు అమలు చేయించాలన్నారు.
ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నా చేసినట్టు… వారి ధర్నాలో రైతులు లేరని, రైతులకు బీజేపీ నిజ స్వరూపం అర్థమైందన్నారు. కిషన్ రెడ్డి యాసంగి గురించి మాట్లాడకుండా వానాకాలం ధాన్యం సేకరణ గురించి మాట్లాడుతున్నారని, పారా బాయిల్డ్ రైస్ వచ్చేదే యాసంగి లో అది కొంటామని కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బురద జల్లడమే బీజేపీ కిషన్ రెడ్డి పనా అన్నారు.
కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదని, రేపటి ధర్నాలు ప్రారంభం మాత్రమే. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుందన్నారు. కిషన్ రెడ్డి వడ్లన్నీ కొంటామని ఆర్డర్ తెస్తే ఎయిర్ పోర్టు కు వచ్చి సన్మానం చేస్తామన్నారు. విదేశాంగ విధానం మార్చి బియ్యం ఎగుమతి నిబంధనలు మార్చండని, పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వరు.. నష్టాలు ఎందుకు భరించరన్నారు. కేంద్రం ధాన్యం పై యూ టర్న్ తీసుకోవడం వల్లే సమస్య ఉత్పన్నమైనదన్నారు.
Also Read : వడ్ల కొనుగోలుకు కేంద్రాన్ని వెంటాడుతాం