Sunday, November 24, 2024
HomeTrending Newsనాడు కంట తడి ఉంటే ..నేడు పంట తడి ఉంది : మంత్రి హరీశ్‌రావు

నాడు కంట తడి ఉంటే ..నేడు పంట తడి ఉంది : మంత్రి హరీశ్‌రావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.దుబ్బాక నియోజకవర్గంలోని నరేండ్లగడ్డ గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యం వల్ల ప్రతి పొలం వాకిట్లోకి సాగు నీరు అందుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామ కాల్వలు, వాగులు మండుటెండలలో నిండి పారుతున్నాయని వివరించారు. రోజుకు 30 కోట్లు వెచ్చించి నెలకు వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్తు కొనుగోలు చేసి రైతులకు నిరంతరం కరెంటు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్రంలో యాసంగిలో భూములు పడావుగా ఉంటే నేడు సీఎం కేసీఆర్ హయాంలో విత్తనం వేయక ముందే రైతుబంధు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ తల్లిదయతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చారని తెలిపారు. నరేండ్లగడ్డ గ్రామంలో మహిళా భవనానికి రూ.10 లక్షలు, ముదిరాజ్ భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉగాది పండుగ తర్వాత ఇండ్లను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు.

Also Read : వైద్య సేవల్లో తెలంగాణ మూడో స్థానం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్