గవర్నర్ గవర్నర్ గా కాకుండా బిజెపి కార్యకర్త తరహాలో పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గవర్నర్ తమిళ సై పై ఫైర్ అయ్యారు.ఈ మేరకు సూర్యపేట జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక పద్దతిలో ఎన్నికయిన ప్రభుత్వం రూపొందించే చట్టాలను అడ్డుకునే అధికారం అమెకెకెక్కడిదంటూ ఆయన ఘటుగా స్పందించారు. రాజ్యాంగ మూల సూత్రాలను కాదని చట్టాలు రూపొందిస్తే అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టు ధర్మసనానికి మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామిక ప్రభుత్వాలు నిండు సభలో శాసనసభ్యుల ఆమోదంతో రూపొందించిన చట్టాలను నిలువరించే హక్కు గవర్నర్ కెక్కడిదని ఆయన నిలదీశారు.యావత్ ప్రపంచానికి భారత పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం స్ఫూర్తిదాయకంగా నిలిస్తే మోడీ సర్కార్ దాన్ని తూట్లు పొడుస్తుందంటూ ఆయన మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు అని ఆయన పేర్కొన్నారు. బిజెపి యోతర రాష్ట్రాల అభివృద్ధి ని అడ్డుకునే కుట్రలో ఇది భాగమని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్ లో పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.రాష్ట్ర శాసనసభ లో ఒకలా…రాజ్ భవన్ లా ప్రవర్తించడం గవర్నర్ తమిళ సైకే చెల్లిందన్నారు.నిన్న గాక మొన్న నిండు సభలో తెలంగాణా అభివృద్ధిని స్వయంగా కొనియాడిన గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ కు వెల్లంగానే అదే సభలో ఆమోదించిన పద్దులను పెండింగ్ లో పెట్టడమే ఇందుకు తార్కాణమన్నారు.
బిజెపి యోతరులు పాలిస్తున్న రాష్ట్రాలలో గవర్నర్ ను కేంద్రం బిజెపి కార్యకర్త లాగా వినియోగించుకుంటుందన్నారు.అది రాజకీయ పరంగా బిజెపి కి నష్టమే కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.తమిళనాడు శాసనసభ సమావేశాలలో ఇదే అంశాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీర్మానం చేసింది అంటే కేంద్రం వైఖరి ఏమిటో బట్టబయలు అయిందన్నారు.గవర్నర్ నడ్దు పెట్టుకుని కేంద్రం ఆడుతున్న దుర్మార్గమైన నాటకానికి ఇది నిదర్శనంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుంటే తట్టుకోలేక బిజెపి ఈ డ్రామాలను తెర లేపిందని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాల డిమాండ్ బిజెపి పాలిత రాష్ట్రాలలో వస్తున్నందునే ఇటువంటి కుట్రలకు బిజెపి రూట్ మ్యాప్ గీసిందని ఆయన విరుచుకుపడ్డారు.బిజెపి పాలిత రాష్ట్రాల కంటే బిజెపి యోతర రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి మోడీ సర్కార్ కు కంటగింపు గా మరినందునే రాజ్ భవన్ లను అడ్డుపెట్టుకుని గవర్నర్ లతో బిజేపి యెతర రాష్ట్రాలలో శాసన సభలో ఆమోదించిన బిల్లులను పెండింగ్ లో పెడుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.