సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇవాళ తన ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. సివిల్స్ ఫలితాలతో సంక్పలం, పట్టుదలకు చెందిన కొన్ని అద్భుతమైన కథలు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సివిల్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన టాప్ ముగ్గురు అమ్మాయిలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంకర్లను కూడా మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. మీ ప్రతిభ, ప్రయత్నాలతో ఈ దేశాన్ని మీరు ముందు ఉండి నడుపుతారని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు.
సివిల్స్ 2021 ర్యాంకర్లను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి టాప్ మూడు స్థానాలను అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. టాపర్‌గా శ్రుతి శర్మ నిలిచింది. ఇక రెండవ, మూడవ ర్యాంక్‌లను అంకితా అగర్వాల్, గామిని సింగ్లాలు సొంతం చేసుకున్నారు. తెలుగువారిలో యశ్వంత్‌రెడ్డికి 15వ ర్యాంక్, సంజన సింహకు 37వ ర్యాంక్ వచ్చింది. భూపాలపల్లికి చెందిన యువకుడు నరేశ్‌కు 117వ ర్యాంక్ రావడం విశేషం. నిజామాబాద్ యువతి స్నేహకు 136వ ర్యాంకు, సూర్యాపేటకు చెందిన చైతన్యరెడ్డికి 161వ ర్యాంకులు వచ్చాయి.
Also Read : సివిల్స్ సాధించిన బీర్పూర్ యువకుడు