ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమే…త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ కు నుంచి వి ఎస్ టి చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిను ( నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్) ఈ రోజు మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చినంక కట్టిన 20వ ఫ్లై ఓవర్ ఇదని, ఈ బ్రిడ్జి ఏర్పాటుతో ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ దాకా దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగం ముఖ్య అంశాలు –
SRDP కార్యక్రమంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. అద్భుతమైన అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 36 పనులను పూర్తి చేశాము.
గత ప్రభుత్వాలు హైదరాబాద్ సెంట్రల్ నగరాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నూతన సచివాలయం, అమరవీరుల స్తూపం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. దీంతోపాటు ఇందిరా పార్కును కూడా అభివృద్ధి చేస్తాం
ఈ ప్రాంతంతో అద్భుతమైన సంబంధాలు ఉన్న కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి అనుబంధాన్ని, ఆయన ఇక్కడి ప్రజలకు… కార్మికులకు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరును పెడుతున్నాం. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది
ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ కేంద్రంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం చేస్తున్నది
హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుకూలంగా గట్టి పునాది ఈ తొమ్మిది సంవత్సరాలలో పడింది
గతంలో మాదిరి మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే దుస్థితి ఈరోజు లేదు. గత పది సంవత్సరాలలో మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నది
ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గులకు, చిల్లర పార్టీల వారి మోసాలకు గురైతే మరో వందేళ్లు ఈ నగరం వెనక్కి పోతుంది
60 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీల మోసపు మాటలు నమ్మవద్దు
ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమే ఇంకా త్వరలో ప్రతిపక్షాలకు బిఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతున్నది
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకత
హైదరాబాద్ లో ఎస్.ఆర్.డి.పి ద్వారా రూ.450 కోట్ల వ్యయం తో చేపట్టిన మొట్ట మొదటి స్టీల్ ఫ్లై ఓవర్గా నిలవనున్నది. మిగతా ఫ్లై ఓవర్ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్ తో ఫ్లై ఓవర్ను పూర్తి చేశారు. మొట్ట మొదటి సారిగా మెట్రో బ్రిడ్జి పై నుండి ఫ్లై ఓవర్ చేపట్టడం జరిగింది. ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి సివిల్ వర్క్స్, యుటిలిటీ లిఫ్టింగ్, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ. 450 కోట్లను వెచ్చించారు.
ఇందిరా పార్కు నుండి వి. ఎస్.టి స్టీల్ బ్రిడ్జి ఫ్లై ఓవర్ పొడవు 2.62 కిలోమీటర్లు కాగా, ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలో మీటర్లు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వివరాలు
ప్లై ఓవర్ వెడల్పు.16.61 మి.కాజ్వే.
మొత్తం 81 పిల్లర్లు.
స్టీల్ ఫ్లై ఓవర్ మొత్తం 2.620 మీ. పొడవు స్టీల్ నిర్మాణం 2437 మీటర్ల పొడవు
స్పాన్ పొడవు 297 మీ.
విఎస్టి అప్ ర్యాంపు 150 మీ.
విఎస్టి డౌన్్యంపు 78మీటర్ అప్రోచ్ వాల్
లైన్ల బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్(16.60 మీటర్లు,).
ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులో రావడంతో ఇందిరాపార్క్ జంక్షన్ మొ దలు అశోక్ నగర్, అర్టిసి క్రాస్ రోడ్ మీదగా సిగ్నల్ రహిత బాగ్ లింగంపల్లి విఎస్టి జంక్షన్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత ప్రయాణంఅందుబాటులోకి రానుంది. ఉస్మా నియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గనుంది.