Sunday, January 19, 2025
Homeసినిమాతెలంగాణ యాసకి గౌరవం పెరిగింది: కేటీఆర్  

తెలంగాణ యాసకి గౌరవం పెరిగింది: కేటీఆర్  

ప్రియదర్శి – కావ్య జంటగా నటించిన ‘బలగం‘ సినిమా ఈ నెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఈ సినిమాకి, కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. ‘బొబ్బిలిరాజా’ సినిమాలో బాలనటుడిగా పరిచయమైన వేణు, ఆ తరువాత కమెడియన్ గా చాలా సినిమాలలో నటించాడు. ‘జబర్దస్త్’లోను కొంతకాలం పాటు సందడి చేశాడు. దర్శకుడిగా ఆయన చేసిన ఫస్టు మూవీనే ‘బలగం’.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ‘సిరిసిల్ల’లో జరిగింది. ఈ వేడుకకి చీఫ్ గెస్టుగా కేటీఆర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ .. ‘సిరిసిల్ల’లో ఈ సినిమా షూటింగు జరగడం సంతోషంగా ఉంది. ఇక్కడి సంస్కృతిని వేణు చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక్కడి మనుషులు .. అనుబంధాలను మనసులను తాకేలా చిత్రీకరించాడు. లోతైన ఎమోషన్స్ తో కదిలించాడు. ఈ సినిమాలో పాటలైతే చాలా బాగున్నాయి.

ఇక సినిమా అంత కూడా ఇదే విధంగా ఉంటూ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. దిల్ రాజు కూతురు తండ్రిని మించిన పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. కొత్త టాలెంటును ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సిరిసిల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కేసీఆర్ గారి వలన బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అందువలన షూటింగులకు అనుకూలంగా ఉన్నాయి.

ఒకప్పుడు తెలంగాణ యాస మాట్లాడటానికి అంతా కూడా మొహమాటపడ్డారు. ఈ మధ్య కాలంలో సీరియల్స్ లో .. సినిమాల్లో ప్రధానమైన పాత్రాలు కూడా తెలంగాణ యాస మాట్లాడుతున్నాయి. అది తెలంగాణ యాసకి దక్కిన గౌరవంగా .. గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ సినిమా కంటెంట్ పై నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్