Saturday, January 18, 2025
HomeTrending Newsరేవంత్ అండ్ కో ఆగమాగం బ్యాచ్

రేవంత్ అండ్ కో ఆగమాగం బ్యాచ్

ముఖ్యమంత్రి కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారని మంత్రి కే తారక రామారావు ఎద్దేవా చేశారు. కొందరు అల్పులు అధికారాన్ని గుంజుకుంటామంటున్నారని, కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు సమక్షంలో  టీఆర్ఎస్ లో చేరిన సింగరేణి బొగ్గుగనుల బీఎంఎస్ నేత కెంగర్ల మల్లయ్య. కేసీఆర్ నాలుగు రోజులు బయట తిరుగుతే అందరి నోర్లు మూతపడ్డాయన్న మంత్రి సోనియాగాంధీ తెలంగాణ తల్లి అన్న రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియాగాంధీ అన్నడని విమర్శించారు. కొన్ని రోజులు ఆగితే చంద్రబాబు తెలంగాణ తండ్రి అంటాడన్నారు.

నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నీతి మాటలు చేపుతున్నాడని, పార్టీ మారడం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రజలు కొడుతారని మంత్రి హెచ్చరించారు. కేసీఆర్ పేరు ఉచ్చరించే అర్హత రేవంత్ రెడ్డి కి లేదన్నారు.  రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పదవి దొరికినట్లు బిల్డప్ కొడుతున్నాడని, టీడీపీ లో గెలిచిన రేవంత్ రెడ్డి రాజీనామా చేశారా అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.  కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్ లా రేవంత్ తీరు ఉందన్న మంత్రి  భాద్యత గా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.

టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ ల కోసం కెసిఆర్ ను తిట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారన్నారని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు సీఎం గా ఉన్నారనే విషయం మరచిపోవద్దని కేటిఆర్ అన్నారు. కెసిఆర్ ను ఎదుర్కోవాలంటే ఆయన కన్నా ఎక్కువగా తెలంగాణ ను ప్రేమించగలగాలని, డైలాగ్ లు కొడితే కెసిఆర్ ను కొట్టలేరన్నారు.

దుబ్బాక విజయంతో బీజేపీ ఎగిరెగిరి పడుతోందన్న మంత్రి కేటిఆర్ నాగార్జునసాగర్ లో బీజేపీ కి డిపాజిట్ పోయిందని, జానారెడ్డి లాంటి నేతను ఓ యువకుడు ఓడించాడన్నారు. 77 నియోజక వర్గాల పరిధి లో జరిగిన రెండు ఎమ్మెల్సీ సీట్లను టీ ఆర్ ఎస్ గెలిచిందని, పాలపొంగు లాంటి గెలుపుతో మిడిసి పడోద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చిందన్నారు. పాదయాత్రలు చేసే నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని కరోనా తర్వాత ఆరోగ్యమైనా కుదుట పడుతుందన్నారు. కనీసం పాదయాత్ర చేస్తే నైనా టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో  పల్లెలు అభివృద్ధి చెందిన విషయం తెలుస్తుందన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతటి అభివృద్ధి ఉందా పాదయాత్ర చేసే నేతకు కనిపిస్తుందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు రైతు బంధు అమలు చేస్తున్నాయా అని మంత్రి ప్రశ్నించారు. పల్లెల్లో ట్రాక్టర్లు ,డంప్ యార్డులు బీజేపీ పాలనలో ఉన్నాయా,ఎక్కడైనా ఇస్తున్నారా బిజెపి నేతలు చెప్పాలన్నారు. రైతు బంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ,పాలమూరు ప్రాజెక్టు లకు బీజేపీ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని మంత్రి కేటిఆర్ అడిగారు. హుజురాబాద్ కు బీజేపీ వెయ్యి కోట్ల ప్యాకేజి ఇస్తా అంటే మేము వద్దు అంటున్నమా అని మంత్రి ప్రశ్నించారు. అక్బర్- బాబర్ కథలు మానుకోవాలి- తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందో చెప్పాలని మంత్రి కేటిఆర్ డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికుల కోసం తీర్మానం చేసిన బీజేపీ ఆ తర్వాత బుట్టదాఖలు చేసిందని,  తెలంగాణ పథకాలు కాపీ కొట్టి కేంద్రం పథకాలు అమలు చేస్తోందన్నారు. సింగరేణి కార్మికులకు టీఆరెస్ ఇచ్చిన ప్రతిఒక్క హామీని నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సింగరేణి కార్మికుల పాత్ర 30 నియోజకవర్గాల్లో ఉంటుందని,  సింగరేణి కార్మికులు రాబోయే ఎన్నికల్లో పార్టీతో కలిసి పనిచేయాలని మంత్రి కేటిఆర్ పిలుపు ఇచ్చారు.

కెంగర్ల మల్లయ్య టీ ఆర్ ఎస్ పార్టీ లో చేరిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్ ,గువ్వల బాలరాజు ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు, ఎంపీ వెంకటేష్ నేత, పెద్ద పల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు, టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఏం .శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్