Saturday, January 18, 2025
HomeTrending Newsఫ్రాన్స్ పయనమైన మంత్రి కేటిఆర్ బృందం

ఫ్రాన్స్ పయనమైన మంత్రి కేటిఆర్ బృందం

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పయనం అయిన తెలంగాణ ప్రతినిధి బృందం. ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29వ తేదిన మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవో లతో సమావేశం కానున్న మంత్రి కేటీఆర్. మంత్రితో పాటు ప్రతినిధి బృందంలో ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజాన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిగా విజ్ఞప్తి చేసింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఫ్రెంచ్ సెనేట్లో జరిగే ఈ సదస్సు భారత్-  ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార , వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో పేర్కొంది. అంబీషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకర్ గా  గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era)  అనే అంశం పైన మంత్రి కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకోనున్నారు. గతంలో నిర్వహించిన అంభీషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని, ఈసారి అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదికపైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్ కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపైన  ప్రత్యేక సమావేశాలను ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు ఫ్రెంచ్ మరియు భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ కి పంపిన ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్