Saturday, January 18, 2025
HomeTrending Newsరేవంత్‌ ఉంటే ఆ పార్టీ మటాష్‌: మంత్రి మల్లారెడ్డి

రేవంత్‌ ఉంటే ఆ పార్టీ మటాష్‌: మంత్రి మల్లారెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌ అని అన్నారు. TRSLP లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నారని ఆరోపించారు. రేవంత్‌ చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తారన్నారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గుడని.. బట్టేబాజ్‌ అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌ది రచ్చబండ కాదని.. లుచ్చాబండ అంటూ దుయ్యబట్టారు. రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందన్నారు. ‘‘నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో అనేక ఇబ్బందులు పడ్డా. టీడీపీలో ఉన్నప్పుడు నన్ను కూడా రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. నా కాలేజీలు మూసివేయిస్తానని బెదిరించాడు. మల్కాజ్‌గిరి సీటు రాకుండా అడ్డుకునేందుకు యత్నించాడు. చంద్రబాబుకు వాస్తవాలన్నీ చెప్పి సీటు తెచ్చుకుని..గెలిచా’’ అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

రేవంత్ టీడీపీ లో ఉన్నపుడు లోకేష్ ను పట్టుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నారని, రేవంత్ ఏ పార్టీ లో కూడా సరిగా ఉండరని విమర్శించారు. రేపు రేవంత్ బీజేపీ లో చేరినా ఆశ్చర్యం లేదని, టీడీపీలో ఉండగా రేవంత్ 24 గంటలు నన్ను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు రేవంత్ పిర్యాదు చేస్తే నాకు ఎంపీ టికెట్ ఇచ్చారని, ఎంపీగా గెలిచినా నా పై బ్లాక్ మెయిల్ ఆపలేదని చెప్పారు. కళాశాల లు మూపించ మంటారా పైసలు ఇస్తావా అని నన్ను బెదిరించే రేవంత్ రెడ్డి ఆయన కూతురి పెళ్లి కి పైసలు ఎవరు ఇచ్చారో వాడే చెప్పాలన్నారు. నేనే వాడి బిడ్డకు డబ్బులు ఇచ్చాననని, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా నేను డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా అని మంత్రి మల్లారెడ్డి సవాల్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్