Wednesday, June 26, 2024
HomeTrending Newsబిజెపి నేతల నీతులు విడ్డూరం: పేర్ని నాని

బిజెపి నేతల నీతులు విడ్డూరం: పేర్ని నాని

Minister Nani Fire On Bjp Leaders On Their Comments In connection With petrol Prices :

దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సంక్షేమంలో  ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.  రాకెట్‌ కంటే వేగంగా దేశంలో పెట్రోల్‌, డీజీల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందని వ్యంగాస్త్రం సంధించారు. పెట్రో ఉత్పత్తుల ధరలపై నిన్న ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణపై బిజెపి నేతలు  చేసిన కామెంట్ల పై నాని స్పందించారు.

బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని, ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారని నాని విమర్శించారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110కి  తీసుకెళ్ళి. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. “అక్టోబర్‌లో ధర ఎంత ఉంది? నవంబర్‌లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోదీని డిమాండ్‌ చేయాలి. సెస్‌ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్‌ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు?” అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని, వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనమని నాని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ పరిమితమవుతోందని, బీజేపీ, టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు.

Must Read : అది టెంట్ హౌస్ పార్టీ:  పేర్ని నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్