Minister consoled: భాకరాపేట బస్సు ప్రమాద బాధితులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. శనివారం రాత్రి ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయ లో పడిన సంఘటన లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నేటి ఉదయం బాధితులను పరామరించిన మంత్రి పెద్దిరెడ్డి క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి రుయా సూపరిం డెంట్ డాక్టర్ భారతిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.
మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం నుండి పెళ్లి నిశ్చితార్థం కోసం తిరుపతికి వస్తున్న బస్సు భాకరాపేట ఘాట్ వద్ద బోల్తా పడి లోయలో పడి పోవడం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీ, జాయిం ట్ కలెక్టర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయకచర్యలు పర్యవేక్షించారని, క్షతగాత్రులను రుయా, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారని వివరించారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారని, మరొకరు ఆస్పత్రికి తరలించిన తరువాత మరణించారని చెప్పారు. మిగిలిన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు.
ఈ ఘటనపై సిఎం జగన్ సమీక్షించారని, మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద రెండు లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. జిల్లా యంత్రాంగం సత్వరమే స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్ &బి శాఖ ద్వారా తాత్కాలికంగా రైలింగ్ ఏర్పాటు చేస్తామని..నాలుగు లైన్ల రోడ్డ కు పదిహేను వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామన్నారు.