Thursday, May 1, 2025
Homeస్పోర్ట్స్సింధును కలిసిన మంత్రి రోజా

సింధును కలిసిన మంత్రి రోజా

ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా కలుసుకున్నారు.  సిందుకు రోజా అభిననదనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సింధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్‌ సింగిల్స్ ఈవెంట్‌లో తొలి బంగారు పతకం సాధించిన సింధు విజయానికి యావత్ దేశం గర్విస్తోందని, భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని మస్పూర్తిగా కోరుకుంటున్నట్లు రోజా చెప్పారు.

ఈ సందర్భంగా సింధు, రోజా కుటుంబ సభ్యులు కలిసి విందులో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్