Sunday, January 19, 2025
HomeTrending Newsవిద్యా పథకాలపై మంత్రి సురేష్ సమీక్ష

విద్యా పథకాలపై మంత్రి సురేష్ సమీక్ష

Review on Education: మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీకి సిద్ధం కావాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్  అధికారులను ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరంలో జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన పథకాల అమలుపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకూ చదువుకునే విద్యార్ధులకు అందించే విద్యా కానుక కిట్లపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని, వెంటనే అవసరమైన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సంబంధిత పాఠశాలలకు సామాగ్రి చేరుకునేలా చూసి, స్కూళ్ళు ప్రారంభం కాగానే వాటిని విద్యార్ధులకు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.

విద్యా కానుక తోపాటు 1 నుండి 12వ తరగతి చదువుకునే విద్యార్ధులకు అందించే అమ్మ ఒడి పథకం లబ్దిదారుల జాబితాను తయారు చేయాలని మంత్రి సురేష్ ఆదేశించారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు అర్హుల జాబితా కూడా పారదర్శకంగా రూపొందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కేటాయింపుపై కూడా మంత్రి సమీక్షించారు.

Also Read : ఆ ప్రసక్తే లేదు: మంత్రి సురేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్