Thursday, January 23, 2025
HomeTrending NewsYerrdgondapalem: దళితులను పావుగా వాడుకుంటున్నారు: జవహర్

Yerrdgondapalem: దళితులను పావుగా వాడుకుంటున్నారు: జవహర్

నిన్న సంతనూతలపాడులో ఓ భారీ కుట్రకు వైసీపీ తెరతీసిందని మాజీ మంత్రి కె. జవహర్ ఆరోపించారు. ఎస్పీజీ భద్రతలో ఉన్న చంద్రబాబుపై రాళ్ళు విసిరి తద్వారా ఫైరింగ్ ఓపెన్ చేయించి దానిలో దళితులు మరణిస్తే… ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూసిందని విమర్శించారు. దళితులను ముందు పెట్టి బాబును దళిత ద్రోహిగా చిత్రీకరించాలని చూశారన్నారు.  మంత్రి సురేష్ అర్ధ నగ్న ప్రదర్శన చేసే స్థాయికి దిగజారిపోయారని దుయ్యబట్టారు.

సురేష్ పై ఉన్న కేసును అడ్డం పెట్టుకొని సిఎం జగన్ బ్లాక్ మెయిల్ చేస్తుంటే, ఆయన మెప్పు పొందేందుకే ఇలాంటి కార్యక్రమాలకు తెగబడ్డారని అన్నారు. జగన్ రెడ్డి కాబట్టి చొక్కా విప్పలేదని, సురేష్ దళితుడు కాబట్టి ఆయనతో చొక్కా విప్పించారని, దీనిపై దళిత జాతికి సిఎం జగన్ క్షమాపణ చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు. దళితులను పావుగా వాడుకోవడం దురదృష్టకరమన్నారు. మంత్రి పిచ్చి పరాకాష్టకు చేరుకుందన్నారు.  శిరోముండనం వరప్రసాద్ కు న్యాయం కోసం, డా. సుధాకర్ ను పిచ్చోడు అని ముద్ర వేసినప్పుడు, రాష్ట్రంలో 27 మంది దళితులపై దాడులు చేసి వారి మరణాలకు కారణమైనప్పుడు ఎందుకు చొక్కా విప్పలేదని ప్రశ్నించారు. దళితులకు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు తొలగించినప్పుడు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు తీసేసినప్పుడు సురేష్ నిరసన వ్యక్తం చేయాల్సి ఉందని ఎద్దేవా చేశారు. దళితులపై లోకేష్ ఏవో వ్యాఖ్యలు చేశాడంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోందని, అయితే తాను అలా మాట్లాడానని  నిరూపిస్తే రాజకీయాలనుంచి వైదొలుగుతానని లోకేష్ సవాల్ చేశారని జవహర్ గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్