Sunday, January 19, 2025
Homeసినిమా‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ ఫస్ట్ లుక్ & టీజర్ విడుద‌ల‌

‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ ఫస్ట్ లుక్ & టీజర్ విడుద‌ల‌

Hansika Movie: ఆర్గాన్ మాఫియా గురించి ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన సస్పెన్స్ ఏంక్వైరీ  థ్రిల్లర్ “మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’(ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక) చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  “మై నేమ్‌ ఈజ్‌ శృతి’ టీజర్ బాగుంది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే క్రైమ్ కు సంబంధించిన మెసేజ్ ఓరియెంటెడ్ కథను సెలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీ కి పరిచయమవుతున్న మిత్రుడు బురుగు రమ్య ప్రభాకర్ గౌడ్, దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ లు ఈ కథను చాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. ఈ రోజు ట్యాలెంట్ అనేది సమాజంలో పెరిగిపోయింది. కాబట్టి ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కొత్త తరం, కొత్త యంగ్ స్టర్స్  నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో మంది రావాల్సిన అవసరం ఉంది”

“ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అఖండ, పుష్ప సినిమాలు వచ్చి కొంత పుంజుకోవడం జరిగింది. అలాగే కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి. అందుకే చిత్ర పరిశ్రమ పుంజుకోవాలని ఈ మధ్య టికెట్ రేట్స్ పెంచడం జరిగింది. చిన్న సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 4 షోల నుండి 5 షోలకు పెంచడం జరిగింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి” చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్  హన్సిక మాట్లాడుతూ “మా చిత్ర టీజర్ విడుదలకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.  2022 లో విడుదవుతున్న ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.

Also Read : శరవేగంగా సాగుతున్న హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’

RELATED ARTICLES

Most Popular

న్యూస్