Tuesday, February 25, 2025
HomeTrending NewsTree birthday: చెట్టుకు పుట్టిన రోజు వేడుక

Tree birthday: చెట్టుకు పుట్టిన రోజు వేడుక

8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు జరిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరిత హారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇది ఓట్ల కోసం చేసేది కాదని భావి తరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని వెల్లడించారు. ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్  కృషితో 7.7 శాతం అడవులు పెరిగాయి అని తెలిపారు. మొక్కలు సంరక్షించడం నాటడం మన అందరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు. మొక్కలు నాటడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్