Sunday, January 19, 2025
HomeTrending Newsతెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు భాషకున్న ఔన్నత్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. నవయుగ కవి చక్రవర్తి, పద్మ విభూషణ్, కవి కోకిల, కళాప్రపూర్ణ గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా మంత్రి సురేష్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  మంత్రి సురేష్ మాట్లాడుతూ గుంటూరులో గుర్రం జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నామని, గురజాడ అప్పారావు నివసించిన ఇంటిని స్మారక భవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలో ఒకదానికి జాషువా పేరు పెట్టాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గుంటూరు హిందూ కాలేజీ సెంటర్లో అయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్