Sunday, January 19, 2025
HomeTrending Newsప్రజల కోసం తప్పట్లేదు: రోజా కౌంటర్

ప్రజల కోసం తప్పట్లేదు: రోజా కౌంటర్

రణస్థలి సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రులు అదే స్థాయిలో ప్రతిస్పందించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా స్పందిస్తూ “రెండు సార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిపోయిన.. పవన్ కళ్యాణ్… నీతో తిట్టించుకోవాల..? తూ… ప్రజల కోసం తప్పట్లేదు..!!” అంటూ ఘాటుగా పోస్ట్ చేశారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా “PK అంటే పిచ్చి కుక్క….. “. “నేను సంబరాల రాంబాబునైతే నువ్వు కల్యాణాల పవన్ వి! ” రోజా డైమండ్ రాణి అయితే నువ్వు బాబు గారి జోకర్ వి! @PawanKalyan”  ” అంటూ మండిపడ్డారు.

పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ “నాకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే..” క్యా బాత్ హై ..! @PawanKalyan” ; “అమ్మను తిట్టారని ఏడ్చి, అలగా జనం అన్నారని ఏడ్చి ఆఖరికి వాళ్ల పల్లకినే మోస్తూన్న పవన్ కళ్యాణ్ ని బానిస అనక బాహుబలి అంటారా?”  అంటూ   తనదైన శైలిలో స్పందించారు.

Also Read : తగిన గౌరవం ఇస్తే పొత్తుకు రెడీ: పవన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్