Sunday, January 19, 2025
HomeTrending Newsఘనంగా స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు

ఘనంగా స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు

Ministers Ttd Chairman Participated In Sri Swaroopanandendra Saraswati Birthday Celebrations :

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాంగణంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డాలర్ శేషాద్రి, దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, పలు దేవాలయాలకు చెందిన ఈవోలు హాజరయ్యారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శారదాపీఠంలో స్వరూపానంద సరస్వతి స్వామిని కలుసుకొని శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. మంత్రులు చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

జన్మదిన మహోత్సవ వేళ స్వరూపానందేంద్ర దండ తర్పణం చేశారు. స్వామి జన్మదిన మహోత్సవ వేళ కూపి స్నపనం జరిగింది. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి గురుదేవుల సేవలో పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో ఉన్న నాగదేవతకు పీఠాధిపతుల చేతులమీదుగా అభిషేకం జరిగింది.

ఇవి కూడా చదవండి: 

ఆర్యవైశ్య సత్రాలకు మినహాయింపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్